పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా

ఆర్టీసీ అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించాలి.  


పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి. 


 బంగారు తెలంగాణ చేస్తానని ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ - జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్  


 పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  కలెక్టరేట్ ఎదుట ధర్నా. 


నల్లగొండ: ఆర్టీసీ అదనపు భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే భరించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.గతంలో ఏ ప్రభుత్వం పెంచని విధంగా బస్ చార్జీలు పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం మోపిందని ఆరోపించారు. గతంలో కిలోమీటర్ 2.5 పైసలు పెంచగా, ప్రస్తుత ప్రభుత్వం కిలో మీటర్ కు 20 పైసల చొప్పున పెంచి ప్రజలపై పెనుభారం మోపిందనీ  ధ్వజమెత్తారు. పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలతో ప్రజలపై 1000 కోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు. ప్రభుత్వం అనాలోచితంగా చార్జీలను పెంచిందని విమర్శించారు. ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచడంతో ఈ భారం ఇతర వాటిపై కూడా పడుతుందని అన్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా చార్జీలను పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆర్టీసీ కార్మికులకు వరాలు ఇస్తూనే ప్రజలపై చార్జీల భారం మోపిందని విమర్శించారు. సంస్థ ఆర్థిక భారం తగ్గించుకునేందుకు చార్జీలు పెంచి పేద ప్రజల జేబులకు చిల్లులు పెడుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా పేద ప్రజలపై భారం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం 52 రోజులపాటు సమ్మె కొనసాగించినా, పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరించాడని ధ్వజమెత్తారు. ఆర్టీసీ చార్జీలను పెంచడంలో భాగంగానే కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి కొత్త నాటకానికి సీఎం కేసీఆర్ తెలిపాడని విమర్శించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో ప్రజలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను విపరీతంగా పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చార్జీలు పెంచిందని విమర్శించారు. పెంచిన చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని అన్నారు. అనంతరం కలెక్టరేట్ లో ఏవో కు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ మున్సిపల్  వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పిసిసి కార్యదర్శి కొండేటి మల్లయ్య, నల్లగొండ ఎంపీపీ మనిమద్ది  సుమన్, కేతేపల్లి ఎంపీపీ పెరుమాళ్ళ శేఖర్, కట్టంగూరు మాజీ జెడ్పిటిసి సుంకరబోయిన నరసింహ, తిప్పర్తి  మండల పార్టీ  అధ్యక్షుడు జూకూరి రమేష్, కట్టంగూరు మండల పార్టీ నార్కట్ పల్లి, నకిరేకల్ మండల పార్టీ అధ్యక్షులు పెద్ది సుక్కయ్య, బత్తుల ఉశయ్య, నకిరేకంటి ఏసుపాదం, నాయకులు వడ్డే  భూపాల్ రెడ్డి, జూలకంటి  శ్రీనివాస్, పెరికే వెంకటేశ్వర్లు, అమర్ ఇర్ఫాన్, కాశీరాం, ఏర్పుల రవి, జూలకంటి సైదిరెడ్డి,  దగ్గు అజయ్,  మేరెడ్డి ప్రవీణ్, వనమాల రమేష్ , పేర్ల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.